రాజ రామ శ్రీనివాస ప్రియ సహోదరి
శ్రీ శేషనరసింహ వదనారవింద సిరి వల్లి
కృష్ణ రంగనాథ శ్రీకాంత శ్రీనివాస భ్రాత పత్ని
గిరిజ రమణ స్మితల మమకారమూర్తి
పల్లవించే చంద్రుని మాతృమూర్తి
సియాన్రియాల ఆనంద స్ఫూర్తి
ఆర్యన్మీనాక్షిల కిలకిలల ధాత్రి
చిలకమర్రి వంశ ఉష ఈ స్నుష
మరింగంటి ఇంటి దీవెన ఈ ఉష
శ్రీ శేష నరసింహ మనోగతం
నవ్వులతో విరాజిల్లే మరకతం
ధైర్యే సాహసే శ్రీ వల్లి
అనురాగాభిమాన వెల్లి
అమ్మ అలవోకలే మా ప్రేరణ
అమ్మ ఒడిలోనే మాకు నిర్వాణ!
No comments:
Post a Comment