Thursday, July 23, 2026

Dad's Birthday

సింహ రాశి లో పుట్టిన నరసింహం  
తాయారమ్మ నరసింహాచార్యుల విశేషం 
చిలకమఱ్ఱి కుల తిలకం 
శ్రీ కృష్ణ శ్రీ రంగ శ్రీకాంత శ్రీనివాసాగ్రజం.


శ్రీవల్లి ఆనంద నందన
కమల శోభన సుత సౌభాగ్య శోభ
సియా రియ ఆర్యన్ మీనాక్షి ల ప్రియ తాతిన్
స్మిత రమణ పల్రవి చంద్రుల పూజ్య జనక.

మీ జిజ్ఞాస గగనాంతం
మీ ధైర్యం హిమాలయ శిఖరం 
మీ ఆత్మీయత  అపరిమితం
మీ స్థిత ప్రజ్ఞత మాకు ఆదర్శం.

ఆత్మ స్థైర్యమే మీ కోదండం 
అసమాన సహనం మీ సుదర్శనం 
భాష భావ సమంజస సమన్వయం మీ కౌస్తుభం 
ప్రశాంతత ప్రసన్నత ప్రమోదత మీ త్రిశూలం 

ఈ జన్మదిన వార్షికోత్సవం నాడు ఈ సంవత్సరం  మీకు ఎన్నో మధురమైన అనుభూతులు, చిరస్మరణీయమైన స్మితారమణీయమైన  స్మృతులు,  విన్నూత పల్లవించే అనుభవాలు, భావాలు చేకూరాలని కోరుతూ 
మీ పిల్లలు రవి, పల్లవి, ఆర్యన్, మీనాక్షి 

 


 
 

No comments: